తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మాత్రం 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని 86 వేల 721 మంది భక్తులు దర్శించుకోగా.. 34 వేల 926 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 75 లక్షలుగా లెక్కించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - chittoor
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల అయిపోతుండటం, విద్యార్థుల ఫలితాలు విడుదలవుతున్నవేళ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తిరుమల