తిరుమల ఘాట్‌రోడ్లను తితిదే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలిపిరి గరుడ సర్కిల్ నుంచి వచ్చే భక్తులను వెనక్కి పంపేస్తున్నారు. ఎగువ ఘాట్ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా తితిదే విజిలెన్స్ అధికారులు నిలిపివేస్తున్నారు. కొండ పైనుంచి కిందకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్‌ను మూసేస్తామని అధికారులు తెలిపారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలు మూసివేశారు.
కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్‌రోడ్లు మూసివేత - తిరుమల ఘాట్‌రోడ్లు మూసివేత
తిరుమల ఘాట్‌రోడ్లను తితిదే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్లను మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు.
తిరుమల ఘాట్‌రోడ్లు మూసివేత