తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడి ఊరేగింపు ఘనంగా సాగింది. ఆలయ అర్చకులు నైరుతి మూలలో భూమిపూజ నిర్వహించారు. అనంతరం వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో శ్రీవారు వివిధ వాహనసేవల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - srivari brahmotsavams ankurarpana
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలకు తొలి ఘట్టం పూర్తైంది.

తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ