పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తితిదే, ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తితిదేతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పలు పర్యాటక స్థలాలను బీఈఈ ఎంపిక చేసింది. తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఆ భవనాల్లో ఉత్పత్తి చేయడమే లక్ష్యం’ అని తెలిపారు.
Tirumala: పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమల - ttd
Eco friendly energy efficient in Tirumala: దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని గరిష్ట స్థాయిలో తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
పర్యావరణ హిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమల