ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేద విద్య బోధనలో దేశంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలి' - ttd additional EO Dharmareddy latest news

వేద విద్య బోధనలో దేశంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలని, విద్యార్థులను ప్రతిభావంమైన వేద పండితులుగా తీర్చిదిద్దాలని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి.. అధికారులకు, పాఠశాల సిబ్బందికి సూచించారు.

ttd additional EO Dharmareddy review
తితిదే వేద పాఠశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ధర్మారెడ్డి

By

Published : Sep 3, 2020, 9:39 PM IST

తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సిబ్బందితో, అధ్యాపకులతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్మహించారు. వేదవిద్య బోధనలో భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలని, విద్యార్థులను ప్రతిభావంతమైన వేద పండితులుగా తీర్చిదిద్దాలని సూచించారు. నెల రోజుల్లో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపిన అదనపు ఈవో… పాఠశాలకు కావలసిన వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో బయటి వ్యక్తులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణంలో ఫెన్సింగ్‌ పనులను పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు సూచించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో జంతువులు ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పారిశుద్ధ్య చర్చలు చేపట్టాలని ఆరోగ్య విభాగాన్ని ఆదేశించారు. రాత్రి సమయంలో వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలన్నారు. సమావేశానికి ముందు వేద పాఠశాలలో పూజలు నిర్వహించి ధర్మారెడ్డిని సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details