ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ 8కి ముందే ప్రయోగాత్మకంగా తిరుమల శ్రీవారి దర్శనం!

జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సడలించడానికి ముందే ప్రయోగాత్మకంగా దర్శనాలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పూర్తి స్థాయి దర్శనాలు ఎప్పటినుంచి ఉంటాయనేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు.

tirumal temple
tirumal temple

By

Published : Jun 4, 2020, 4:47 PM IST

తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే పరిధిలోని వివిధ శాఖల విభాగ అధిపతులతో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశానికి ముందు తితిదే ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో, అదనపుఈవోలు ప్రత్యేకంగా సమావేశమై తిరుమలలో దర్శన ఏర్పాట్లపై చర్చించారు. తితిదే ఛైర్మన్‌తో చర్చించిన అంశాలను ఈవో అధికారులకు వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనమతించడంతో ఈ నెల 8 నుంచి దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు ఈవో తెలిపారు. లాక్‌డౌన్‌ సడలించడానికి ముందే ప్రయోగాత్మకంగా దర్శనాలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఈవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

దర్శనాలకు ఎంత మందిని భక్తులను అనుమతించాలి, భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శన టికెట్ల కేటాయింపు, తిరుమలలో వసతి కేటాయింపు తదితర అంశాలు మరో సారి చర్చించి శుక్రవారం ఉదయం భక్తులకు తెలియచేస్తామని ఈవో చెప్పారు.

ఇదీ చదవండి:ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్ష దాటుతున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details