ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ర‌థ‌స‌ప్త‌మి: పద్మావతి అమ్మవారికి వాహన సేవలు ఇలా.. - ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారు వార్తలు

ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన్ని పురష్కరించుకొని అమ్మవారికి వాహనసేవలు కన్నులపండువగా జరపనున్నారు. ఆరోజు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా వాహనసేవలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

tiruchanuru padmavati ammavaru
ర‌థ‌స‌ప్త‌మి పర్వ దినాన అమ్మవారి వాహన సేవలు

By

Published : Feb 16, 2021, 5:13 PM IST

ఫిబ్ర‌వ‌రి 19న తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన్ని పురష్కరించుకొని అమ్మవారికి వాహన సేవలు కన్నులపండువగా జరపనున్నారు. రథసప్తమినాడు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వాహనసేవలు నిర్వహించనున్నారు.

వాహన సేవల వివరాలు..

ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హంసవాహనం. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు అశ్వ వాహనం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 వరకు చిన్నశేష వాహనం. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గజ వాహనం సేవలు నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి...

రథసప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details