చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం అమ్మవారు తిరువీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించలేదు. ఏటా తొలి 3 రోజుల్లోనే ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేవారు. సర్కారు సమర్పించిన వస్త్రాలతో గజవాహనం రోజు అమ్మవారిని అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకుంటున్నందున పట్టువస్త్రాల కోసం తితిదే నిరీక్షిస్తోంది. ఆదివారం పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తిరుచానూరు అమ్మవారికి ప్రభుత్వ పట్టువస్త్రాలేవీ..? - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వార్తలు
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు రథంపై భక్తులకు అమ్మ దర్శనమిచ్చింది. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ఇప్పటివరకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించలేదు. ఆదివారం పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏటా తొలి 3 రోజుల్లోనే ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేవారు.
ttd