ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు అభయం - tiruchanur brahmotsavam 2020 news

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పద్మావతి అమ్మవారు తనకెంతో ప్రీతిపాత్రమైన గజ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.

tiruchanoor ammavaru
tiruchanoor ammavaru

By

Published : Nov 15, 2020, 10:03 PM IST

Updated : Nov 15, 2020, 10:39 PM IST

గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు అభయం

చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన ఆదివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద ‌గ‌ల వాహ‌న మండ‌పంలో అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి అలంకరించే లక్ష్మీ కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించారు.

వాహనసేవలో తితిదే జీయ‌ర్ స్వాములు, తితిదే ఈఓ జవహర్ రెడ్డి దంపతులు, జేఈవో బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

Last Updated : Nov 15, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details