చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీలో నిర్వహించే తిరు ఉత్సవ్ కార్యక్రమానికి... ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణం సిద్ధమైంది. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుల్లో తలమునకలై విద్యార్థులు కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిరీక్షిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) శాశ్వత ప్రాంగణంలో తిరు ఉత్సవ్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో నిర్వహించే ఈ పండగంటే సాంస్కృతిక సంబరాలే కాకుండా... సాంకేతిక పరంగా ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు ఆన్లైన్, ఆఫ్ లైన్లో కూడా పోటీలు నిర్వహించడం విశేషం. చిత్తూరుతో పాటు తమిళనాడులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. జనవరి 31 సాయంత్రం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్' - tiru utsav at tirupati iit
తిరుపతి ఐఐటీలో నేడు తిరుఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి చిత్తూరు, తమిళనాడులోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరుకానున్నారు.
![తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్' tiru utsav is going to start on january 30th at tirupati iit campus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5904599-194-5904599-1580451759899.jpg)
నేడు ప్రారంభం కానున్న తిరు ఉత్సవ్