మూడవ రోజు ఘనంగా తిరు ఉత్సవ్-2020 - tiru utsav 2020 latest news
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీలో జరుగుతున్న తిరు ఉత్సవ్-2020 కార్యక్రమం ఉల్లాసంగా సాగుతోంది. విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు.
![మూడవ రోజు ఘనంగా తిరు ఉత్సవ్-2020 tiru utsav 2020 third day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5937231-614-5937231-1580704348489.jpg)
తిరు ఉత్సవ్-2020
మూడవ రోజు తిరు ఉత్సవ్-2020
చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో తిరు ఉత్సవ్ 2020 కార్యక్రమం మూడవ రోజు ఘనంగా జరిగింది. బైక్ రేసింగ్ పోటీలతో అలరిస్తూ విద్యార్థులు కేరింతలు కొట్టారు. స్థానిక విద్యార్థులతో పాటు ఐఐటీ మద్రాసు, జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పోటీలను తిలకించారు. ప్రముఖ గాయకుడు గౌరవ్ మేహాత యువతలో ఉత్సాహాన్ని నింపుతూ... పాట పాడుతూ నృత్యం చేశారు. విద్యార్థుల కేరింతలతో ఐఐటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది.