టిక్‌టాక్ మోజు.. అడవిలో దారితప్పిన యువకుడు
టిక్‌టాక్ మోజు ఓ విద్యార్థిని అడవుల పాలు చేసింది. టిక్‌టాక్ చేసేందుకు శేషాచలం అడవులకు వెళ్లి దారితప్పాడో యువకుడు. రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు.
టిక్ టాక్ మోజు ఓ విద్యార్థిని అడవుల పాల్జేసిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. మురళీ అనే విద్యార్థి శేషాచలం అడవులలో టిక్ టాక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి ప్రదేశం కోసం వెదుకుతూ దారి తప్పాడు. రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు. చివరకు వాట్సప్ ద్వారా స్నేహితులకు తానున్న లొకేషన్ షేర్ చేయడంతో బతికి బయటపడ్డాడు. అతని ఆచూకీ కోసం స్నేహితులు పోలీసులు సాయంతో అర్థరాత్రి అడవికి వెళ్లి రక్షించారు. ఉదయానికి అతడిని అడవి నుంచి బయటకు తీసుకురాగలిగారు. భయంతో మురళికి ఫిట్స్ రావడంతో తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. కలకడ మండలానికి చెందిన మురళి తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.