సీపీఐ చేపట్టిన టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం తిరుపతిలో ఉద్రిక్తలకు దారి తీసింది. నగర శివారులోని వికృతమాల గృహ సముదాయల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. గృహ ప్రవేశాలు చేసేందుకు యత్నించిన లబ్దిదారులను అదుపులోకి తీసుకున్నారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను అర్హులైన వారికి అప్పచెప్పడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు.
టిడ్కో గృహప్రవేశాల కార్యక్రమం ఉద్రిక్తం
తిరుపతిలో సీపీఐ చేపట్టిన టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గృహ ప్రవేశాలు చేసేందుకు యత్నించిన లబ్ధిదారులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఉద్రిక్తలకు దారితీసిన టిడ్కో గృహప్రవేశాల కార్యక్రమం
ఉదయం నుంచే సీపీఐ నేతలను గృహ నిర్భంధం చేసిన పోలీసులు.. సీపీఐ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. టిడ్కో గృహాల వద్దకు వెళ్లేందుకు యత్నించిన సీపీఐ నేతలు, లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: