ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా.. ఆ ఇంటి పని మనిషికీ పాజిటివ్​...

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండల కేంద్రంలో ఓ వస్త్రవ్యాపారి కుటుంబంలో ముగ్గురికి, ఆ ఇంటి పనిమనిషికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో 21 మందిని అధికారులు క్వారంటైన్​కు తరలించారు. ఆ వస్త్రవ్యాపారి ఇటీవలే హైదరాబాదు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

thtee members tested positve corona in single family at chittoor dst kothkota mandal
thtee members tested positve corona in single family at chittoor dst kothkota mandal

By

Published : Jun 14, 2020, 6:43 PM IST

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండల కేంద్రంలో ఒక వస్త్ర వ్యాపారి కుటుంబానికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. వస్త్ర వ్యాపారి ఇటీవల హైదరాబాద్​కు వెళ్లి వచ్చారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు అతని కుటుంబంలో భార్య, కుమార్తె, ఇంటి పనిమనిషికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. 500 మీటర్ల పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.21మంది అనుమానితులను క్వారంటైన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details