ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళహస్తిలో 19న త్రిశూల స్నానం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా నిర్వహించే త్రిశూల స్నానం, సద్యోముక్తి ఉత్సవానికి అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19 న జరిగే క్రతువుకు స్వర్ణముఖి నదిలో కొలను ఏర్పాటుచేశారు.

శ్రీకాళహస్తిలో త్రిశూల స్నానం

By

Published : Feb 17, 2019, 3:44 PM IST

మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో త్రిశూల స్నానం, సద్యోముక్తి ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లతో పాటు గణపతి, కుమారస్వామి, త్రిశూలం, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను అలయం పక్కన ఉన్న నదిలో కొలువు దీర్చనున్నారు. ఈ నెల 19న జరిగే కార్యక్రమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఉత్సవమూర్తుల వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.

ఇవి కూడా చదవండి.

ABOUT THE AUTHOR

...view details