నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట-చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రజలతోపాటు పలు గ్రామాలు కలిసిపోయి ఉంటాయి. నిత్యావసర వస్తువులకు. వైద్యం కోసం ఇటువారు అటూ... అటువారు ఇటూ వస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా సరిహద్దులను కంచెతో మూసేశారు.
శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యం కోసం అధికారులు సూళ్లూరుపేట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే మూడు రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడికండ్రిక, సత్యవేడు గ్రామాల వారు అత్యవసర పరిస్థితుల్లో సూళ్లూరుపేట రావడానికి ఇబ్బందిగా మారింది.