కరోనా నుంచి కోలుకున్న ముగ్గురుని చిత్తూరులోని జిల్లా కొవిడ్ ఆస్పత్రి నుంచి గురువారం డిశ్ఛార్జి చేశారు. వీరు మరో 14 రోజుల పాటు స్వీయగృహ నిర్బంధంలో ఉండాలని డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, కొవిడ్ ఆస్పత్రి నోడల్ అధికారి జయరాజన్, ఆస్పత్రి యూనిట్ హెడ్ నరేష్‌రెడ్డి సూచించారు. వడమాలపేటకు చెందిన యువకుడు (25), శ్రీకాళహస్తికి చెందిన మహిళ(30), ఆమె కూతురు(9)కు ప్రభుత్వం తరఫున వారికి రూ.2 వేలు చొప్పున తహసీల్దారు సహాయం అందించారు. తిరుపతి రుయా నుంచి శ్రీకాళహస్తికి చెందిన మహిళ (30), పలమనేరుకు చెందిన వ్యక్తి(43) డిశ్ఛార్జి అయ్యారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, నోడల్ ఆఫీసర్ సుబ్బారావు, ఆర్‌ఎంవో హరికృష్ణ, హెచ్‌డీఎస్ వర్కింగ్ ఛైర్మన్ బండ్ల చంద్రశేఖర్‌రాయల్ వీరికి సూచనలు చేశారు.చిత్తూరు కొవిడ్ ఆస్పత్రిలో గురువారం వైద్యులు 106 మందికి గళ్ల నమూనాలను సేకరించారు.
చిత్తూరులో కోలుకున్న కరోనా బాధితులు.. ఐదుగురు డిశ్చార్జి - corona latest news in chittoor dist
చిత్తూరులోని జిల్లా కొవిడ్ ఆస్పత్రి నుంచి కోలుకున్న ముగ్గురు కరోనా బాధితులను గురువారం డిశ్ఛార్జి చేశారు. వీరు మరో 14 రోజుల పాటు స్వీయగృహ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.

కొవిడ్ ఆస్పత్రి నుంచి వెళ్తున్న బాధితులు
ఇవీ చూడండి...