విషాదం: తెలుగుగంగ కాలువలో పడి ముగ్గురు యువకులు మృతి - chithore district crime
18:53 June 04
ముగ్గురు యువకుల జలసమాధి
చిత్తూరు జిల్లా బీఎన్.కండ్రిగ మండలంలోని తెలుగుగంగ ఉప కాలువలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ మెకానిక్ షెడ్లో పనిచేస్తున్న అరవింద్(సుళ్లూరుపేట), కాకినాడకు చెందిన రాజు, బీఎన్.కండ్రిగకు చెందిన ప్రభు.. ముగ్గురూ బుచ్చినాయుడు కండ్రిగలోని ప్రభుకు చెందిన మెకానిక్ షెడ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
కార్యక్రమం ముగించుకున్న అనంతరం సరదాగా తెలుగుగంగ ఉప కాలువ వద్దకు వెళ్లారు. అదుపుతప్పి ముగ్గురూ కాలువలో పడిపోయారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకులను బయటకు తీశారు. అప్పటికే ముగ్గురూ మృతి చెందారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.