ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో మూడు పాజిటివ్ కేసులు.. భయంలో ప్రజలు - today corona news in chittoor

చిత్తూరు జిల్లాలో మరో 3 కరోనా కేసులు నమోదు కావడంపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 77 కేసులు నమోదు కాగా.. అత్యధికంగా శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి.

Three more corona cases registered in Chittoor
Three more corona cases registered in Chittoor

By

Published : Apr 29, 2020, 1:50 PM IST

చిత్తూరు జిల్లాలో ఇవాళ మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77కి చేరింది. ఇవాళ్టి కేసులన్నీ శ్రీకాళహస్తిలోనే వెలుగుచూసిన కారణంగా.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. గతంలో కరోనా సోకిన రెవెన్యూ ఉద్యోగి కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్ గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 47 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. అక్కడ ప్రతి ఆరు గంటలకొకసారి పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 16 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details