ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..! - చిత్తూరు జిల్లా వెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా వెల్లంపల్లిలో జరిగింది.

three members died in electric shock
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

By

Published : Dec 9, 2019, 12:29 PM IST

విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వెల్లంపల్లి ఎస్టీ కాలనీలో విషాదం జరిగింది. కట్టెల కోసం ఊరి శివార్లకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... విద్యుదాఘాతంతో మృతి చెందారు. వెల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య, చెంచమ్మ భార్యా భర్తలు.. వారి కుమారుడు గౌతమ్​ ఈ ఘటనలో చనిపోయారు. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్​ తీగలు తగిలి వీరు చనిపోయినట్లు భావిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details