ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు..రెండిళ్లు దగ్ధం - చిత్తూరు జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ వల్ల రెండిళ్లు దగ్ధఁ

చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు విద్యుత్ ప్రమాద ఘటనల్లో రూ.3.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇరుప్రాంతాల్లోనూ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తేల్చారు.

short circuit
ఆహుతైన ఇళ్లు

By

Published : Dec 8, 2020, 8:40 PM IST

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం పాపేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసు గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో రూ. 1.5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు.. రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితుడిని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఆహుతైన ఇళ్లు

పీలేరులోని ప్రకాశం రోడ్డులో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో.. నూరుళ్ల అనే వ్యక్తి గృహం దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సామాగ్రి కాలిపోగా.. రూ. 2 లక్షల నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details