చిత్తూరు జిల్లాలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు ప్లాస్మా దానం చేశారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న రంగస్వామి, గాలేరు నగరి సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, మరో ఓఎస్డీ కిరణ్ కుమార్.. వ్యాక్సినేషన్ ద్వారా అభివృద్ధి చెందిన ప్లాస్మాను సోమవారం దానం చేశారు.
డిప్యూటీ కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును విప్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులకు, మేజర్ అపరేషన్, తలసేమియా, న్యూట్రిషనల్ అనీమియా, యూటరస్ బ్లీడింగ్, దీర్ఘకాలిక తీవ్ర క్షయ వ్యాధిగ్రస్తులకు ఈ ప్లాస్మా ఉపయోగపడుతందని వైద్యులు తెలిపారు.