ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెకు మూడు మృతదేహలు తరలింపు - మదనపల్లెకు మూడు మృతదేహలు తరలింపు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో... మృతి చెందిన వారిలో ముగ్గురి మృతదేహలను చిత్తూరు జిల్లా మదనపల్లెకు తరలించారు. మిగిలిన వారి మృతదేహాలు సోమవారం తరిగొండకు చేరుకునే అవకాశం ఉంది.

మృతదేహలను ఇంట్లో తీసుకెళ్తున్న బంధువులు
మృతదేహలను ఇంట్లో తీసుకెళ్తున్న బంధువులు

By

Published : Feb 15, 2021, 12:58 AM IST


కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మందిలో ముగ్గురి మృతదేహాలను చిత్తూరు జిల్లా మదనపల్లె కు తీసుకువచ్చారు. అజ్మీర్ యాత్ర కోసం 18మందితో టెంపులో బయల్దేరిన నజీరా బీ కుటుంబం... కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నజీర్, మెకానిక్ షఫీ, మరో మృతురాలు అమీర్ జాన్​ తదితరుల మృతదేహలకు కర్నూలు లో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృత దేహాలను చిత్తూరు జిల్లా మదనపల్లె కి తరలించారు. ఆదివారం రాత్రి 11.30 నిమిషాలకు మూడు మృతదేహాలు మదనపల్లె కు చేరుకున్నాయి. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మరో 11మృతదేహాలు చిత్తూరు జిల్లా తరిగొండకు సోమవారం చేరుకునే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details