తిరుమలలోని దుకాణదారులు, వివిధ బ్యాంకుల అధికారులతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఆస్థాన మండపంలో సమావేశమయ్యారు. వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని ఈవో కోరారు. అధిక ధరలకు విక్రయాలు జరపవద్దని సూచించారు. శ్రీవారి హుండీ ద్వారా నెలకు ఐదు కోట్ల రూపాయల విలువైన చిల్లర నాణేలు కానుకలుగా వస్తున్నాయని... వాటిని బ్యాంకులకు అప్పగించి తిరిగి వ్యాపారస్తులకు అందిస్తామన్నారు. 500, 200, 100, 50 రూపాయల నోట్లను ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకుల లైసెన్సు ఫీజును నిర్ణీత కాలంలో చెల్లించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ కృషిచేయాలని కోరారు.
'భక్తులకు అధిక ధరలకు విక్రయించకండి.. స్నేహంగా ఉండండి' - తిరుపతి టెంపుల్ న్యూస్
తిరుమలలోని పలు సమస్యలపై ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. దుకాణదారులతో, వివిధ బ్యాంకుల ఉద్యోగులతో మాట్లాడారు. భక్తులకు వస్తువులను అధిక ధరలకు విక్రయించవద్దని.. స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
'భక్తులకు అధిక ధరలకు విక్రయించొద్దు'