తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే అని.. ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి అన్నారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదు లక్షల మెజారిటీతో గెలుస్తామని చెప్పిన వైకాపా... ఆ స్థాయిలో ఆధిక్యత తెచ్చుకోకపోవడం వారి ఓటమిని స్పష్టం చేస్తోందన్నారు. బయటి ప్రాంతాల నుంచి మనుషులను పిలిపించి దొంగ ఓట్లను వైకాపా వేయించినా ప్రజలు తమ వెంట నిలిచారని చెప్పడానికి తెదేపాకు వచ్చిన ఓట్లే నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తెదేపానే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే: పనబాక లక్ష్మి - thirupathi parliament latest news
తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా విజయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్పందించారు. ఎన్నికల్లో వైకాపా గెలిచినప్పటికీ... నైతిక విజయం తమదేనని ఆమె స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి