వైకాపా పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావటమే లక్ష్యంగా... నూతన కార్యవర్గానికి తెదేపా అధినేత చంద్రబాబు బాధ్యతలు అప్పగించారని తిరుపతి పార్లమెంట్ తెదేపా ఇన్ఛార్జ్ నరసింహయాదవ్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. జిల్లాలో నానాటికీ పెరిగిపోతున్న భూ ఆక్రమణలు అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
'ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావటమే తెదేపా లక్ష్యం' - thirupathi news updates
వైకాపా పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెదేపా అండగా ఉంటుదని ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహయాదవ్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్