తితిదేలో ఓ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1300 మంది ఉద్యోగులను తొలగించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో కాంట్రాక్టు ఉద్యోగులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదని.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తితిదే ఛైర్మన్, ఈవోలతో మాట్లాడి మరో నెల రోజుల పాటు ఏజెన్సీకి అనుమతిచ్చారు. ఏజెన్సీ మారినా.. ఉద్యోగులకు భరోసా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తితిదే కాంట్రాక్టు ఉద్యోగుల ఏజెన్సీ గడువు నెల పెంపు - తిరుపతి టెంపుల్ వార్తలు
తమను ఉద్యోగాల నుంచి తొలగించడంపై తితిదేలో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని.. కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
![తితిదే కాంట్రాక్టు ఉద్యోగుల ఏజెన్సీ గడువు నెల పెంపు thirupathi MLA Bhoommana Karunakar Reddy assures to the thirupathi temple contract employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7013991-104-7013991-1588318207129.jpg)
thirupathi MLA Bhoommana Karunakar Reddy assures to the thirupathi temple contract employees