శ్రీవారి ఆలయంలో ఈనెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా గురువారం వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలను స్వీకరించమని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
Tirumala: సిఫారసు లేఖల స్వీకరణ నేడు రద్దు: తితిదే - ttd responding on misinformation
తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనంను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే తితిదేపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తితిదే
తితిదేపై అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు
తితిదే వెబ్‌సైట్‌లోని తోమాల సేవను కొందరు వ్యక్తులు తోమస్ సేవగా మార్చి అసత్య ప్రచారం చేస్తున్నారని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసి, భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఇలాంటి కుట్రలను తీవ్రంగా పరిగణిస్తోందని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదీ చదవండీ..TS - AP WATER WAR: మా నీటికి ఎసరు.. తెలంగాణను అడ్డుకోండి