ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు

తిరుమల(tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 13, 16 తేదీలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచగానే.. 10 నిమిషాల్లోనే మొత్తం టికెట్లన్నీ భక్తులు బుక్‌చేసుకున్నారు.

Thirumala Srivasa special entrance darshan tickets released today
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

By

Published : Jul 9, 2021, 8:48 AM IST

Updated : Jul 9, 2021, 11:03 AM IST

తిరుమల(tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 13, 16 తేదీలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఉదయం 9 గంట‌లకు వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే జులై నెల టికెట్లు రోజుకు 5 వేలు చొప్పున విడుదల చేసింది.

మరోవైపు సామాన్య భక్తులకు కలియుగ వైకుంఠనాథుడి దర్శనం కరవైంది. కరోనా రెండో దశ ఉద్ధృతితో నిలిపేసిన సర్వదర్శనాన్ని... కేసులు తగ్గుముఖం పట్టినా తిరిగి ప్రారంభించలేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కొనసాగిస్తున్న తితిదే... సర్వదర్శనం టోకెన్లు జారీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

4 నెలలుగా 300 నుంచి 10 వేల రూపాయల వరకు ఏదో ఒకస్థాయిలో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు మినహా.... సాధారణ ప్రజలు శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా రెండో దశలో కేసుల ఉద్ధృతి వల్ల ఏప్రిల్‌ 11 నుంచి తిరుమలేశుని దర్శనంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ కేంద్రాలను అధికారులు మూసేశారు. కానీ ఆన్‌లైన్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తోంది.

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించని తితిదే... ప్రముఖుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు మాత్రం భారీగా కేటాయిస్తోంది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలు... ఇలా వివిధ రూపాల్లో డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసినవారు రోజుకు 18 నుంచి 20 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు.

నిన్న శ్రీవారిని 17,736 మంది భక్తులు దర్శించుకున్నారు. 7,838 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.60 కోట్లుగా సమకూరింది.

ఇదీ చూడండి.

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

Last Updated : Jul 9, 2021, 11:03 AM IST

For All Latest Updates

TAGGED:

ttdttd news

ABOUT THE AUTHOR

...view details