తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి కారణంగా ఏకాంతంగా ఉత్సవాలు జరగనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. రేపు శ్రీ సుందర రాజస్వామివారికి, జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు పంచద్రవ్యాలతో అభిషేకం జరిపిస్తామని తితిదే అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి:శాస్త్రోక్తంగా శ్రీవారి సహస్రకలశాభిషేకం