తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
PUVVAD AJAY KUMAR: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తెలంగాణ మంత్రి - puvvada ajay kumar latest updates
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి