ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ జరిపించారు. అలాగే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sri Padmavati Ammavari Karthika Brahmotsavalu
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

By

Published : Nov 11, 2020, 2:57 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ధనుర్లగ్నం లో ఆలయంలోని ... ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగరవేసి... సకల దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానం పలికారు. అలాగే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు రాత్రి నుంచి జరిగే చిన్నశేష వాహనసేవతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ... జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలాగే శ్రీ పద్మావతి ... అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details