Thiruchanur: వైభవంగా.. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు - తిరుచానూరు
Sri padmavathi Ammavari Karthika Brahmotsavalu: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదిలక్ష్మీదేవి అలంకారంలో శంఖు చక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయంలోని వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అమ్మవారిని సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుందని నమ్మకం. వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, తితిదే అధికారులు పాల్గొన్నారు.
శ్రీపద్మావతి
.