లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మద్యం దొరక్క మందుబాబులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ సుబ్బయ్యనగర్లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. షాపు వెనుక నుంచి దుకాణంలోకి చొరబడ్డ దుండగులు రూ.90 వేలు విలువైన మద్యాన్ని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తిరుపతిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ - tirupathi government liquor shop robbery news
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ సుబ్బయ్య నగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు రూ.90 వేలు విలువైన మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ