తిరుమలలో హైదరాబాద్ వాసుల నగదు చోరీ - hyderabad
తిరుమల మణిమంజరీ అతిథి గృహంలో బస చేసిన హైదరాబాద్ వాసుల విలువైన వస్తువులు, నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించామని, దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.
తిరుమల కొండపై చోరీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన విజయ్‌సేన్ రెడ్డి కుటుంబం.... శ్రీవారి దర్శనానికి మంగళవారం తిరుమలకు వచ్చారు. పద్మావతినగర్‌లోని మణిమంజరి అతిథిగృహంలో బస చేశారు. వేకువజామున లేచి చూసేసరికి 2 లక్షలకుపైగా నగదుతోపాటు.... సుమారు 10 తులాల ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వగా అతిథి గృహంలొ పనిచేసే సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీల చేపట్టారు. గదికి పక్కనే అటవీ ప్రాంతంలో పర్సులను కనుకొన్నారు. ఆధారాలు సేకరించామని.. దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు చెప్పారు.