చిత్తూరు జిల్లా శ్రీకావేరిరాజుపురం పంచాయతీ ఏటుకూరి పల్లెలో ఓ యువతి బావిలో పడిపోయింది. నందిని(18) బహిర్భూమి కోసం వెళ్లగా.. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడుస్తున్నా యువతి ఆచూకీ లభించలేదు. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఇలాంటి దుస్సంఘటన జరగడం ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నేడు ఆ యువతి పుట్టిన రోజు... నిన్న బావిలో పడి గల్లంతు - srikaverirajupuram latest news
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఏటుకూరి పల్లెలో ఓ యువతి బావిలో పడిపోయింది. సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడిచినా ఆమె ఆచూకి లభ్యం కాలేదు.
![నేడు ఆ యువతి పుట్టిన రోజు... నిన్న బావిలో పడి గల్లంతు relief operations at well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9326756-81-9326756-1603784449392.jpg)
బావిలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది