శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టోత్తర శత కుండాత్మక శ్రీనివాస మహాయాగం జరగనుంది. నేటి నుంచి 18వ తారీఖు వరుకు మూడు రోజుల పాటు ఇందుకోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 108 హోమ గుండాలను సిద్ధం చేయగా వివిధ రాష్ట్రాలకు చెందిన 108 మంది రుత్వికులు పాల్గొననున్నారు. కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
శ్రీనివాస మంగాపురంలో మహాయాగానికి ఏర్పాట్లు - yagam
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో... అష్టోత్తర శత కుండాత్మక శ్రీనివాస మహాయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు క్రతువు నిర్వహించనున్నారు.
వైభవంగా శ్రీనివాసుని అష్టోత్తర శత కుండాత్మక యాగం