చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని నరసింగాపురం రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో స్కార్పియో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన తాటిముంజులు విక్రయించే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తాటిముంజులు కొనడానికి వచ్చిన వారు నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిలో తీవ్రంగా గాయపడిన రజని(28)ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదుపుతప్పిన దూసుకొచ్చిన కారు... ఒకరు మృతి - vehicle crashed news in chandragiri mandal
కారు అదుపుతప్పి రోడ్డు పక్కన తాటిముంజులు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నిలిపిన 3ద్విచక్రవాహనాలు ధ్వంసం కావడంతో పాటు ఓ మహిళ మృతి చెందింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో ఈ ఘటన జరిగింది.
![అదుపుతప్పిన దూసుకొచ్చిన కారు... ఒకరు మృతి The vehicle crashed into the roadside seller in chittoor dst chandragiri mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7367309-58-7367309-1590574701845.jpg)
The vehicle crashed into the roadside seller in chittoor dst chandragiri mandal