చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ ఆలయంలో హుండీ చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. మోడల్ కాలనీలోని ఆలయంలో.. దొంగతానికి ప్రయత్నించారు. ముసుగులు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు.. హుండీని పగులగొట్టేందుకు చూశారు. స్థానికులు గుర్తించి వెంబడించగా.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హుండీ చోరీకి విఫలయత్నం.. స్థానికుల అప్రమత్తతో పరార్ - చిత్తూరు జిల్లాలో హూండీ చోరీ సీసీటీవీ ఫుటేజ్ వార్తలు
పట్టపగలే.. దొంగలు ఆలయంలో హుండీ పగులగొట్టే ప్రయత్నం చేసిన ఘటన.. చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం సృష్టించింది. విషయం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వెంబడించారు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
![హుండీ చోరీకి విఫలయత్నం.. స్థానికుల అప్రమత్తతో పరార్ The thugs tried to steal the hundi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9735853-40-9735853-1606895496800.jpg)
హుండీ చోరీకి యత్నించిన దుండగులు