తిరుపతి నగరంలోని తాతయ్యగుంటకు చెందిన మహేష్.. మద్యానికి బానిసై వీధిలో కనిపించిన వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. ఈ విషయంపై మహేష్ తల్లిదండ్రులు మందలించారు. దీనిని అవమానంగా భావించిన మహేష్... తన ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య - తిరుపతి నేర వార్తలు
తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తిరుపతిలోని తాతయ్యగుంటలో జరిగింది.
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య