చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అడవులలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ చేపట్టింది. 13 ఎర్రచందనం దుంగలతో పాటు, ఓ తమిళ స్మగ్లర్లును అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నుంచి రంగంపేట అడవులలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజ్లోని శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో దాదాపు 15 మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.
అధికారుల రాకను పసిగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. పరిసరప్రాంతాలను పరిశీలించగా... 13 ఎర్రచందనం దుంగలను, ఓ తమిళ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.