ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో కూంబింగ్.. ఎర్రచందనం దుంగలు స్వాధీనం - Task force officers cumbing in seshachalam forest

శేషాచలం అడవులలో టాస్క్ ఫోర్స్ అధికారుల కూంబింగ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం పట్టుబడింది. ఆరు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Task Force Officers
టాస్క్ ఫోర్స్ అధికారులు

By

Published : Jul 21, 2021, 5:27 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో దొనకోటి గంగమ్మ గుడి సమీపంలో ఆరు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్​ఎస్​ఐలు విశ్వనాథ్​, లింగాధర్ టీమ్​లు నిన్న రాత్రి భాకరాపేట అడవుల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున దొనకోటి గంగమ్మ గుడి వద్ద కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టారు. అయితే స్మగ్లర్లు దుంగలు పడవేసి పారిపోయారు. ఎర్రచందనం దుంగలు తబలకి ఉపయోగించేవి కావడంతో బలంగా ఉన్నాయి. ఇవి 200 కిలోలు ఉన్నట్లు ఎస్పీ సుందర రావు తెలిపారు. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకట రవి, డీఆర్వో నరసింహ రావు, ఆర్​ఎస్​ఐ సురేశ్​.. పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details