Chittoor Government Hospital: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్వాకం నివ్వెరపోయేలా చేసింది. వృద్ధురాలి కాలుకు జరుగుతున్న చికిత్సను మధ్యలోనే ఆపారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ(62) గతేడాది డిసెంబరు 31న ఇంట్లో జారిపడి తొడ ఎముక వద్ద గట్టిగా తగలడంతో కుటుంబ సభ్యులు ఈ నెల నాలుగో తేదీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
ప్రభుత్వ డాక్టర్లో.. మీరు మామూలోళ్లు కాదు - ఇదేందయ్యా ఇది ఇదీ ఎప్పుడూ సూడలే
Chittoor Government Hospital: పేదలు అనారోగ్యంతో ఉంటే ప్రభుత్వాసుపత్రికి వెళ్తారు. ఆ వృద్ధురాలు అదే పని చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సర్జరీ చేయలేమని చికిత్సను మధ్యలోనే ఆపారు. ఈ ఘటనతో ప్రభుత్వాసుపత్రిలపై నమ్మకం పోతుందని స్థానికులు అంటున్నారు.
కిందపడి తొడ ఎముక విరగడంతో వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలు కిందపడి తొడ ఎముక విరిగింది. ఈనెల 4వ తేదీ ఆస్పత్రికి తీసుకురాగా.. పలుమార్లు శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్, ఎక్సరేలను బయట ప్రైవేటు కేంద్రాల్లో చేసుకుని రావాలని సూచించారు. చివరికి మూడు రోజుల కిందట శస్త్ర చికిత్స ప్రారంభించారు. అయితే శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపివేసి.. వృద్ధురాలి తొడ ఎముకలు మెత్తగా ఉన్నాయని..వేరే ఆస్పత్రికి రెఫర్ చేశారని వృద్ధురాలి బంధువులు తెలిపారు. తొడను కోసి మధ్యలోనే ఆపివేసి..మళ్లీ కుట్లు వేశారని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: