ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లు, ఎర్ర వారి పాలెం, మదనపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వలసపల్లి పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల గంగులమ్మ అనే వృద్ధురాలు తన బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని.. తోటి ఓటర్లకు ఆదర్శంగా నిలిచింది.

By

Published : Feb 13, 2021, 11:00 AM IST

Updated : Feb 13, 2021, 4:26 PM IST

The second phase of elections in Chittoor district is going on peacefully amid heavy security
బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

చిత్తూరు జిల్లాలో రెండో విడత ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లి పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల గంగులమ్మ అనే వృద్ధురాలు.. తన కుమారుడు, కోడలితో కలిసి బాధ్యత నెరవేర్చింది. ఓటు హక్కును వినియోగించుకుని.. తోటి ఓటర్లకు ఆదర్శంగా నిలిచింది.

మరోవైపు.. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Last Updated : Feb 13, 2021, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details