తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభవాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్పస్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత.. అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఒకేరోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు నిండిపోయాయి. ఈ వేడుకకు సంబంధించి మరికొంత సమాచారం ఈ వీడియోలో..
వైభవంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు - తిరుమల తాజా వార్తలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు స్వామివారు ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వైభవంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు