ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందినవారికి కళ్యాణి డాం పోలీసు శిక్షణ కళాశాలలో తర్ఫీదునిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. శిక్షణా కాలంలో శ్రద్ధగా నేర్చుకొని..ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉద్యోగి ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
'ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు పనిచేయాలి' - Tirupati Urban SP News
ఉద్యోగి ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందినవారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలన్నారు.
ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు పనిచేయాలి