తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకొని నెల రోజుల పాటు వివిధ హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. అలాగే శ్రీ కాలభైరవ స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు . అనంతరం ప్రముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి శాక సప్తమి - సప్త విప్ర భోజన వ్రతం విశిష్టత గురించి వివరించారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో నవగ్రహ హోమం
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు హోమాలు నిర్వహిస్తున్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో నవగ్రహ హోమం