ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడిన గుప్తనిధుల మిస్టరీ.. 10 మంది అరెస్టు - The mystery of cryptocurrencies in chottoor

గుప్త నిధుల కోసం పూజలు చేసి.. గోతులు తవ్వి వెలికి తీసేందుకు యత్నించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 మందిలో 10 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

the-mystery-of-cryptocurrencies-chased-by-palamaneru-police-in-chittoor-district
వీడిన గుప్తనిధుల మిస్టరీ.. 10 మంది అరెస్టు

By

Published : Mar 4, 2020, 12:59 PM IST

వీడిన గుప్తనిధుల మిస్టరీ.. 10 మంది అరెస్టు

గుప్త నిధుల వేట కోసం వెళ్లి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్​తో ఆస్పత్రిలో చేరిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరు పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన 10 మందిని రిమాండ్​కు తరలించనున్నట్లు పలమనేరు సీఐ శ్రీధర్ తెలిపారు.

వివరాలు ఇవీ...
పలమనేరు మండలం దొడ్డిపల్లి అటవీ పరిధిలో కంసలోని ఉంట వద్ద ఫిబ్రవరి 12వ తేదీన పూజలు నిర్వహించి గుప్తనిధుల కోసం గోతులు తీసి.. సగం పని ముగించుకుని వచ్చారు. 15వ తేదీన తిరిగి అడవిలోకి వెళ్తుండగా రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. 14 మందిపై కేసులు నమోదు చేసి..10 మందిని అరెస్టు చేశారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన రైతులపైనా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగుల మందు తాగించాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details