ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈమె కన్న తల్లేనా? పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా? - crime news

పిల్లలు అల్లరి చేస్తే కోప్పడతారు. తీరు మారకుంటే బెదిరిస్తారు. మహా అయితే.. ఓ దెబ్బతో దారిలోకి తెచ్చుకుంటారు. కానీ.. కర్కశత్వానికి మారుపేరులా.. అమానవీయతకు నిదర్శనంగా.. క్రూరాతి క్రూరమైన, భయంకరమైన మనస్తత్వానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రవర్తించిందా తల్లి. ఈ దారుణాన్ని చూస్తే.. ఆమె అసలు ఆ బిడ్డకు కన్నతల్లేనా అన్న అనుమానం రాక మానదు. అంతకుమించి.. ఆమెపై అసహ్యం కలగక మానదు. అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్న వారిని సైతం ఆగ్రహానికి గురి చేసేలా.. కన్నీరే ఎరగని కఠినాత్ములను సైతం ఆవేదనకు గురిచేసేలా.. మాతృత్వపు మాధుర్యానికే మచ్చ తెచ్చేలా.. ఆమె ప్రవర్తించిన తీరు.. నిజంగా.. నిస్సందేహంగా.. సిగ్గు చేటు. ఇంతా చేసి.. చివరికి జైలుపాలైన ఆ తల్లి.. తన కుమారుడిని సాధారణ స్థితికి చేర్చగలదా? ఆ పసిబిడ్డ ఆనందంగా నవ్వేలా చేయగలదా?

CRUEL MOTHER
CRUEL MOTHER

By

Published : Aug 29, 2021, 9:53 PM IST

Updated : Aug 29, 2021, 10:09 PM IST

దారుణం. ఘోరం. ఈ సంఘటన గురించి చెప్పేందుకు పదాలు దొరకడం లేదు. ఈ చిన్నారి బాధను తెలియజేసేందుకు అక్షరాలు సైతం ముందుకు రావడం లేదు. కన్న తల్లి చేతిలోనే కఠినమైన శిక్షను అనుభవించిన ఈ పసికందు ఆవేదనను, ఆక్రందనను వివరించేందుకు.. ఏ భాషా దొరకడం లేదు. ఏ మాత్రం కనికరం లేకుండా.. కనీసం కన్న బిడ్డ అన్న జాలి, దయ కూడా లేకుండా.. పైశాచికంగా హింసించడమే కాదు.. ఆ దారుణాన్ని.. ఆ కన్నతల్లి చిత్రీకరించిన తీరుకు.. కఠిన శిక్షలు వేయాల్సిన చట్టాలు సైతం సిగ్గుతో తలదించుకుంటాయేమో. ఇంతటి ఆవేదనకు.. ఆ చిన్నారి ఆక్రందనకు కారణమైన ఘటన.. తమిళనాడులో జరిగింది. భర్తపై కోపంతో.. ఆ తల్లి.. నిస్సహాయుడైన తన కుమారుడిని కనికరం లేకుండా శిక్షించింది. నోటి నుంచి రక్తం కారుతున్నా ఛావబాదింది. పదే పదే ముక్కు, పెదాలపై దాడి చేస్తూ.. పసి పిల్లాడి జుట్టు పట్టి లాగుతూ.. వెన్నుపై వాతలు పడేలా బాదుతూ.. చిత్ర హింసలకు గురిచేసింది.

పసిబడ్డను హింసిస్తూ వీడియోలు తీసిన తల్లి

ఐదేళ్ల క్రితం వివాహం.. నిత్యం వాగ్వాదం

హృదయ విదారకంగా కంటతడి పెడుతున్న ఆ పసి పిల్లాడిని ఇంతటి క్రూరంగా దాడి చేసిన ఆ తల్లి పేరు.. తులసి. వయసు 23 ఏళ్లు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మధుర - మెట్టూరు గ్రామానికి చెందిన వడివజగన్ తో ఆమెకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొత్తలో మూడేళ్లపాటు వారు చెన్నైలో నివసించారు. వారికి గోకుల్ (4), ప్రదీప్ (2) అని బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా వారు తమిళనాడులోని విల్లుపురం జిల్లా మెట్టూరులో నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి.. తరచూ గొడవలు జరిగాయి. అది కాస్తా.. వడివజగన్ పై తులసి కక్ష పెంచుకునేవరకూ వెళ్లింది.

కుమారుడిని కొడుతూ వీడియో రికార్డ్..

ఈ క్రమంలో.. ఫిబ్రవరి 23న భర్త ఇంట్లో లేని సమయంలో తులసి చిన్న కుమారుడు ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టింది. తాను కొడుతున్న సమయంలో దానిని తల సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసింది. ఆ పసికందు పడుతున్న బాధ సరిగ్గా కనిపించేలా సెల్ఫీ కెమెరా యాంగిల్ మార్చి మరీ రికార్డ్ చేసింది. తులసి దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని చుట్టుపక్కల వారు రక్షించి, చికిత్స కోసం పుదుచ్చేరి జిప్‌మెర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ ఆసుపత్రిలో కోలుకుంటూ.. తండ్రి వడివజగన్ సంరక్షణలో ఉంటున్నాడు. ఇదే సమయంలో తులసి తన భర్త నుంచి విడిపోయి చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలానికి వచ్చేసింది. కానీ.. తులసి చిన్నారిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతూ.. వైరల్‌గా మారింది.

అసలు గొడవేంటి..

నెలలు నిండకుండానే పుట్టిన ప్రదీప్ ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండేది కాదు. తరచుగా ప్రదీప్ శరీరంపై గాయాలు గమనించిన తండ్రి వడివజగన్.. భార్యను ప్రశ్నించేవాడు. బాబు కిందపడ్డాడని.. అప్పుడు దెబ్బలు తగిలినట్లు అబద్ధం చెబుతూ ఉండేది. కానీ.. అవి తల్లి తులసి చేసిన గాయాలేనని భర్త తెలిపాడు. ఈ విషయం తనను తీవ్రంగా షాక్ కు గురిచేసిందని తెలిపాడు. భార్య హింస విషయం తట్టుకోలేక పోయిన అతడు.. భార్యపై సత్యమంగళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లి తులసిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఆమెను పట్టుకునేందుకు ఐదుగురు బృందంతో ఆంధ్రప్రదేశ్ లోనూ దర్యాప్తు చేశారు.

చివరికి...

చిత్తూరు జిల్లా అనిపల్లిలో తండ్రి దగ్గరే తులసి ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అనిపల్లిలోనే కన్నబిడ్డను చిత్రహింసలకు గురి చేసినట్టుగా భావిస్తున్నారు. చివరికి.. తులసిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

HYDERABAD: ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Last Updated : Aug 29, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details