మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్.కె.రోజా నగరి రావడంతో... వైకాపా అభిమానులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నగరి వరకు అడుగడునా ఆమెకు హారతులు పట్టారు. పుత్తూరులో భారీ గజమాలతో సత్కరించారు. నగరి ప్రజల ఆశీస్సుల వల్లే మంత్రి కాగలిగానన్న రోజా... ఇంతటి అభిమానం చూపిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
పుష్పగుచ్చాలు ఇచ్చి :మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.... శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. అనంతరం చిన్న ముషిడివాడ నుంచి సర్క్యూట్ హౌస్ వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్క్యూట్ హౌస్ గార్డ్స్ నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.